మనకు మనం మహాత్ములం..! మరో శకం పునాదులం..!.
మనకు మనం మహాత్ములం మరో శకం పునాదులం.
గతి తప్పిన ప్రగతి కోసం ఓ అడుగేయలేని ముసలోళ్లం
పడుచుపిల్ల పక్కనుంటే మురిసే ముదిరిన కుర్రోళ్ళం.
పక్కవాడు ఎదుగుతుంటే నవ్వలేని మొరటోళ్లం, ఓర్వలేని మంచోల్లం.
మనకు మనం మహాత్ములం మరో శకం పునాదులం.
కులమంటే మాదేనంటూ మతచిచ్చు మరొకరిదంటూ మరిపించే మూర్ఖులం, సొంత ఇంటి కాకులం.
దేశమంటే మనదేనంటూ విదేశాలకే విలువిచ్చే
అమ్మ ఉన్న అనాధలం, పరదేశ వీధి బాలలం.
మనకు మనం మహాత్ములం మరో శకం పునాదులం.
సాయపడే మనసున్న ధీనజాతి ప్రేమికులం,సమయం లేని సగటోళ్లం.
జనంలో మనమంటూ జనాభాని పెంచుతున్న వారసులం, అర్ధరాత్రి శ్రామికులం.
మనకు మనం మహాత్ములం మరో శకం పునాదులం.
కులం తప్ప కలం తెలియని పాలించే పాలకులం, బయట పేలలేని తుపాకులం.
పనిలేని పనులకే పథకాలిచ్చే నాయకులం,కొలువు లేని కొత్తోల్లం, పనికిరాని పాతోల్లం.
మనకు మనం మహాత్ములం మరో శకం పునాదులం.
తల్లితండ్రి కష్టపడితే తిని తిరిగే తీరికలేని ఖాళీలం, విలువలేని వజ్రాలం.
తోడునీడ లేనేలేని బ్రతుకుతున్న పిరికోల్లం, బంగాళాలో పేదోళ్ళం.
మనకు మనం మహాత్ములం బతుకుతున్న సమాధులం......
ReplyForward

Comments
Post a Comment