ఊయల
బలహీన క్షణాలతో కూడిన గతం
బలంగా లాగుతూ తనలో
బందిస్తున్న ప్రతిసారీ ఓడిపోతున్న నేను..
తిరిగే ప్రతి సందులో నవ్విన ప్రతి జ్ఞాపకం
నీతో నడక నేర్చిన నడిరోడ్డుపై
నలిగే నా హృదయం.
పరిగెడుతున్న వయసు
చెట్టునీడలో సేదతీరిన ప్రతి నిమిషం
రగిలినప్రాయం రాజుకున్న ఓ అగ్నిపర్వతం.
వినే ప్రతిపాటలో నిన్నే పోల్చుకుని
కాలం ఆటలో మూగబోయిన జీవనరాగం.
మారుతున్న నిమిషాన్ని మన్నించి
ప్రస్తుతాన్ని ఓర్చుకోలేక విస్తుపోతూ
ఓటమిలో ఒదిగిపోతున్న నేను..
చినుకు జాడలేని ఎడారియదలో
నీతలపు మేఘాలతో కన్నీళ్ల తలస్నానం.
జీవంతో ఉన్నా నిర్జీవం అనలేక
భవిష్యత్తుని గతానికే వదిలేస్తున్న నేను..
Comments
Post a Comment